Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
రూ. 5.5 లక్షలతో తాగునీటి పైప్‌లైన్
పనులు ప్రారంభం
నవతెలంగాణ-అంబర్‌పేట
తాగునీటి పైపులైన్ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం గోల్నాక డివిజన్ మారుతీనగర్‌లో సుమారు రూ. 5.5 లక్షలతో తాగునీటి పైప్‌లైన్ నిర్మాణ పనులను కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాగునీటి, డ్రయినేజీ సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. కలుషితనీరు, లోప్రెషర్ నీటి సమస్యలు తలెత్తకుండా నూతన పైపులైన్ నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. పనుల్లో నాణ్యత లోపం లేకుండా చేపట్టి త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం బస్తీలో పాదయాత్ర నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డుపై నిరుపయోగంగా ఉన్న కరెంటు స్తంభాలను తొలగించాలని చెప్పారు. స్థానికులు హనుమాన్ టెంపుల్ నుంచి నూతన తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని కోరగా, సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బస్తీలో నీటి సమస్యల సమగ్ర పరిష్కారానికి పూర్తి స్థాయి అధ్యయనం చేసి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డాక్టర్ మమత, ఆశా వర్కర్ల సిబ్బంది, వాటర్ వర్క్స్ డీజీఎం సతీష్, ఏఈ రోహిత్, వర్క్ ఇన్స్పెక్టర్ అశ్వక్, జీహెచ్ఎంసీ డీఈ సుధాకర్, వర్క్ ఇన్స్పెక్టర్ మనోహర్, ఎలక్ట్రికల్ వర్క్స్ రజినీకాంత్, టీఆర్ఎస్ నాయకులు కొమ్ము శ్రీనివాస్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.