Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
కాప్రా డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ ఫేజ్-2 కాలనీలో నెలకొన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని కార్పొరేటర్ స్వర్ణ రాజ శివమణి అన్నారు. మంగళవారం వినాయక్ నగర్ ఫేజ్-2లో కాలనీ అధ్యక్షుడు కాసుల పోచయ్యతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగితెలుసుకున్నారు. రోడ్లు, డ్రయినేజీ, విద్యుత్ దీపాలు, తాగునీటి, కమ్యూనిటీ హాల్ తదితర సదుపాయాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు కార్పొరేటర్ దష్టికి తీసుకు వచ్చారు. దీనికి కార్పొరేటర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సుడుగు మహేంద్ర రెడ్డి, వార్డ్ కమిటీ మాజీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు కొప్పుల కుమార్, పవన్, కాలనీ ప్రతినిధులు రాళ్లబండి భార్గవ చారి, కైలాస రాధాకష్ణ, కందాడి శ్రీనివాస్ రెడ్డి, శంకర్, రవి కుమార్, కాశీరెడ్డి, మంగారావు, లెనిన్, సంతోష్ చారి, కష్ణ చారి, కిష్టారెడ్డి, సుబ్రమణ్యం, బ్రహ్మానంద రావు తదితరులు పాల్గొన్నారు.