Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి
నవతెలంగాణ-అంబర్‌పేట
అసంఘటిత రంగంలో పని చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ-శ్రమ్ కార్డులను పొందాలని కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం బాగ్ అంబర్పేట్ డివిజన్ అంబేద్కర్‌నగర్ కమ్యూనిటీ హాల్లో అసంఘటిత రంగ కార్మికులకు ఈ-శ్రమ్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పద్మ వెంకటరెడ్డి మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందించే అద్భుతమైన పథకం ఈ-శ్రమ్ అని అన్నారు. వీటిని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ ఇన్చార్జ్ వెంకటరెడ్డి, డివిజన్ అధ్యక్షులు చుక్క జగన్, ప్రధాన కార్యదర్శి జమ్మిచెట్టు బాలరాజ్, రంగంపల్లి రాజు, మిర్యాల శ్రీనివాస్, శ్రీహరి, నాగరాజుచారి, గుగ్గిళ్ళ శ్రీనివాస్, బాలకష్ణగౌడ్, పరమేష్‌యాదవ్, రాంరెడ్డి, సంతోష్, ఈ-శ్రమ్ కోఆర్డినేటర్ రాకేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.