Authorization
Sat March 22, 2025 02:14:05 am
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎంత జరిగిందో అంతకన్న ఎక్కువ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కుత్బుల్లాపూర్ సీపీఐ కార్యదర్శి ఈ. ఉమామహేష్ అన్నారు. మంగళవారం గాంధీనగర్ ఏఐటీయూసీ కార్యాలయంలో సీపీఐ నాయకులతో కలిసి పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుత్బుల్లాపూర్లో ప్రారంభోత్సవాలకు విచ్చేసిన మున్సిపల్ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులు చేసామని గొప్పలు చెప్పుకోవడం మంచిదే కానీ వాటి కంటే ఎక్కువ భూకబ్జాలు అభివృద్ధి ఎక్కువైందన్నారు. కుత్బుల్లాపూర్లో ఉద్యోగాలు దొరకక యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి నిత్యం హత్యలకు పాల్పడిన సందర్భాలున్నాయన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కల్పించాలని కోరారు. అధికారులకు నియోజకవర్గంలో సమస్యలను పలు మార్లు చెప్పిన పెడచెవిన పెడుతున్నారన్నారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, అన్ని సమస్యలు పరిష్కరిస్తేనే అభివృద్ధి కానీ కొన్నింటిని ప్రారంభించి అభివృద్ధి కాదన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నర్సయ్య, సీపీఐ నాయకులు హరినాథ్, చంద్రయ్య, ఎఐవైఎఫ్ అధ్యక్షులు సంతోష్, యాదన్న, బాల్రెడ్డి పాల్గొన్నారు.