Authorization
Sun March 23, 2025 05:17:02 am
నవతెలంగాణ-కల్చరల్
శ్రీత్యాగరాయగాన సభలో మంగళవారం అరవింద్ ఆర్ట్స్ అసోసియేషన్, నిత్యా ఆర్ట్స్ సంయుక్తంగా ప్రముఖ సినీ గీత రచయిత ఆచార్య ఆత్రేయ జయంతిని పురస్కరించుకొని ఆయన పాటలను వర్ధమాన, ప్రవర్ధమాన గాయకులు గానం చేసి ఆయనకు స్వర నివాళి అర్పించారు. రవి మన్యు, శ్రీ లక్ష్మీ లు మధుర గీతాలను ఆలపించారు. రేవతి, రామ మూర్తి, సౌభాగ్యలక్ష్మి, లక్ష్మి యుగళ గీతాలను సుస్వర బద్దంగా పాడారు.