Authorization
Wed March 19, 2025 01:49:05 pm
ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్
నవతెలంగాణ-బంజారాహిల్స్
అర్హులందరూ ఓటరుగా నమోదు కావాలని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖైరతాబాద్ సర్కిల్ కార్యాలయం వద్ద ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏండ్ల పైబడిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని చెప్పారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వంశీకష్ణ, ఇన్చార్జి డీసీ శ్రీనివాస్, ఎస్సీ రత్నాకర్, ఈఈ విజరు కుమార్, ఇందిరా రాథోడ్, ఏఎంఓహెచ్లు భార్గవ్ నారాయణ, రవికాంత్ పాల్గొన్నారు.