Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకటించిన అపోలో హాస్పిటల్
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
భారతదేశంలో తొలిసారిగా అపోలో హాస్పిటల్ గ్రూప్, తన రోగుల కోసం అంతర్జాతీయ సేవలను అందించడానికి 'ది క్లినిక్ బై క్లీవ్ ల్యాండ్ క్లినిక్'తో కలిసి ఒక సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా అపోలో గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. వైద్యంలో సెకండ్ ఒపీనియన్ అనగా, రోగికి చికిత్స అందిస్తున్న ప్రస్తుత వైద్యుడు కాకుండా, వేరొక ఇతర వైద్యుని అభిప్రాయం తీసుకోవడం అని వివరించారు. రెండో వైద్యుడు రోగి వైద్య రికార్డులను పూర్తిగా పరిశీలించి, ఆరోగ్య సమస్య, దానికి ఎలాంటి చికిత్స చేయాలి అనే దాని గురించి ఒక అభిప్రాయాన్ని ఇస్తాడు. సెకండ్ ఒపీనియన్ అనేది మొదటి వైద్యుడు నిర్ధారణను, చికిత్స ప్రణాళికను నిర్ధారించవచ్చు. అపోలో వైద్యులు క్లిష్టమైన కేసులను సమీక్షించడానికి, అత్యంత సరైనటువంటి చికిత్స ప్రణాళికను రూపొందించడానికి ది క్లినిక్ బై క్లేవ్ ల్యాండ్ క్లినిక్‌లోని ప్రముఖ వైద్య నిపుణులతో కలిసి పని చేస్తారు. ప్రపంచ స్థాయి వైద్య, శస్త్రచికిత్సల అభిప్రాయాలను ఒక చోటుకు చేర్చడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. తద్వారా అపోలో రోగులకు తక్షణమే అత్యుత్తమమైన చికిత్స లభిస్తుందని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ అనుపమ్ సిబల్ తెలిపారు. ది క్లినిక్ బై క్లేవ్ ల్యాండ్ క్లినిక్ సీఈఓ ఫ్రాంక్ మెక్ గిలిన్ మాట్లాడుతూ అపోలో హాస్పిటల్‌తో ఈ ఒప్పందం చేసుకోవడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు.