Authorization
Wed March 19, 2025 09:23:32 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
వాటర్వర్క్స్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి నారాయణ ఆధ్వర్యంలో వాటర్ వర్క్స్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ జలమండలిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మరింత పట్టుదలతో పనిచేసి రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటును అందించాలని సూచించారు. జీవో 14 అమలు కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారత్నం, సంతోష్, ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్, నాయకులు బాలరాజు, శ్రీనివాస్ రెడ్డి, సురేష్, నరేందర్, పాండు, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.