Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మెన్ బాలగోని బాలరాజ్ గౌడ్
నవతెలంగాణ-ముషీరాబాద్
హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో బీసీ బంధు ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మెన్ బాలగోని బాలరాజ్ గౌడ్ అన్నారు. మంగళవారం చిక్కడపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలను విస్మరిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఆంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్న తెలంగాణ పర్యాటకరంగ ప్రాజెక్టులకు తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఐమాక్స్, జలవిహార్, గోల్కొండ రిసార్ట్స్, తారామతి లాంటి అనేక ప్రాజెక్టులను పునః పరిశీలించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రకటించిన ఆత్మగౌరవ భవనాల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మూతపడిన అన్ని కల్లుగీత సొసైటీలను పునరుద్ధరించి, కల్లుగీత వృత్తిని కొనసాగించాలన్నారు. మెడికల్ బోర్డు రద్దును తక్షణమే అమలు చేయాలని కోరారు. కల్లుగీత వృత్తిదారుల సంక్షేమానికి ఐదు వేల కోట్లు కేటాయించి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్ ప్రతిష్టించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మెన్ విజరు కుమార్ గౌడ్, వైస్ చైర్మెన్ గడ్డమీది విజరు కుమార్ గౌడ్ పాల్గొన్నారు.