Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉద్యోగ నోటిఫికేషన్ రాక ఖమ్మం జిల్లాలో సాగర్ అనే విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడాన్ని నిరసిస్తూ ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద మంగళవారం ఎన్టీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. స్వరాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలకాక, విద్యార్థులు, యూత్ ఏండ్ల తరబడి వివిధ ఉద్యోగాలకు సన్నద్ధమై గత్యంతరం లేక తనువులు చాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకోవైపు కొందరు గ్రామాల్లో అడ్డాకులీలుగా, వ్యవసాయ కూలీలుగా మారారు అని చెప్పారు. కార్యక్రమంలో ఓయూ జేఏసీ అధ్యక్షుడు ధర్మపురి శంకర్, పల్స ఆంజనేయులు, మహిపాల్ యాదవ్, ప్రవీణ్ కుమార్, సందీప్, బీమ్ సేన్, నవీన్, అశోక్, గిరికుమార్ నగేష్ పాల్గొన్నారు.