Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
డిజిటల్ సభ్యత్వం నమోదుతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మల్లురవి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, నియోజకవర్గ మెంబర్షిప్ కోఆర్డినేటర్ శశికళ యాదవ రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ సమీక్ష సమావేశం నర్సారెడ్డి భూపతిరెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో డిజిటల్ మెంబర్షిప్ జరుగుతున్న విధానాన్ని తెలుసుకుని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుతున్న నాయకులను అభినందించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని మెంబర్షిప్లో మొదటి స్థానంలో ఉండేలా చేయాలని నాయకులను కోరారు. అనంతరం కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతామని, అదే విధంగా నియోజకవర్గంలో అందరిని సమన్వయ పరుస్తూ అత్యధిక స్థాయిలో మెంబర్షిప్ చేయడానికి కషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ గౌడ్, కుత్బుల్లాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, మహిళ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మి, ఎన్టీవీ ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఐలయ్య గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చాంద్ పాషా, పున్నా రెడ్డి, భారత్ గౌడ్ ప్రవీణ్ గౌడ్, మేకల ఎల్లయ్య, నీలి రహ్మాతుల్లా, వీరేశ్, రాధా కష్ణ, సంజరు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.