Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
హబ్సిగూడ డివిజన్లోని రామ్ రెడ్డి నగర్ కాలనీలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రామ్ రెడ్డి నగర్లోని డ్రయినేజీ, తాగునీటి సమస్య, అదేవిధంగా బస్తీ దవాఖానాల్లో ప్రజలకు అందించే సేవలను పరిశీలించారు. కరోనా సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగేందర్, ఏఈ కీర్తి, జలమండలి అధికారులు జాన్ షరీఫ్, సత్యనారాయణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం రవి, కుమార్, గరిక సుధాకర్, బీవీ చారి, నంది కంటి శివ, కొంగల శ్రీధర్, దాచేపల్లి శ్రీధర్, నరేంద్ర రాజు, డీజే సాయి, సాయి, కష్ణ, అక్బర్, సిద్ధిరాములు, వెంకట సాయి, గణేష్, హరీష్, యాదమ్మ, మున్సిపల్, జలమండలి సిబ్బంది. స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.