Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని అమీర్‌పేట బొంగుల బస్తీలోని ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలో అగంతకుడు చోరీకి యత్నించాడు. బండి తాళం చెవికి ఉన్న ఇనుప పరికరం ద్వారా ఏటీఎం మెషిన్, కీబోర్డును ధ్వంసం చేసి నగదు చోరీ చేయించేందుకు యత్నించారు. ముంబైలోని ఐసీఐసీఐ బ్యాంకు ప్రధాన కార్యాలయం కంట్రోల్ రూమ్‌లో అలారం సిగల్ రావడంతో స్థానిక ఏటీఎంలో విధులు నిర్వహించే చంద్రశేఖర్‌ను అప్రమత్తం చేశారు. చంద్రశేఖర్ వెళ్లి చూస్తే ఏటీఎం పాక్షికంగా దెబ్బతిని ఉండడతో పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.