Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ఆశ్రిత కమ్యూనిటీ కేర్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో గురువారం బాలల హక్కుల పరిరక్షణ కమిటి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సాయిబాబా నగర్ బస్తీ అధ్యక్షులు సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ బాలల పరిరక్షణకు కమిటీ కషి చేస్తుందన్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తక సామగ్రి, రేషన్ సరుకులను అందించారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య లీడర్ శ్రావణి, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ అనిత, లావణ్య, శారద, జయశేఖర్ నాగభూషణం, శేఖర్, పర్వతాలు పాల్గొన్నారు.