Authorization
Wed March 19, 2025 06:17:43 am
నవతెలంగాణ-అంబర్‌పేట
. బస్తీ దవాఖానాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజరు కుమార్‌గౌడ్ అన్నారు. గురువారం పటేల్‌నగర్ చౌరస్తాలో బస్తీ దవాఖాన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం బస్తీలలో దవాఖానాలు ఏర్పాటు చేసి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తుందని ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బస్తీ దవాఖానా భవన నిర్మాణ త్వరగా పూర్తి చేసి పేదలకు వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ సుబ్బారావు, ఏఈ జగదీష్, టీఏ దీపక్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఆమూరి సతీష్, జాకీబాబు, మహేష్ ముదిరాజ్, తిరుపతి, సందాని, వేణు, జమీల్, లవంగు నాగరాజు, అమ్రాన్, శివకుమార్, అండాలు, నాగమణి, సంతోషచారి తదితరులు పాల్గొన్నారు.