Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
నాగారం పురపాలక సంఘంగా ఏర్పడి రెండేండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా గురువారం చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, కౌన్సిలర్‌కు, కో ఆప్షన్ సభ్యులకు, ప్రజలకు, అన్ని పార్టీల నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నాగారం పురపాలక సంఘాన్ని అన్ని విధాలుగా అభివద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. కార్యక్రమంలో కమిషనర్ వాణి, వైస్ చైర్మెన్ మల్లేష్ యాదవ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్స్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.