Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
సీసీ కెమెరాలు ప్రారంభం
నవతెలంగాణ-అంబర్‌పేట
రాష్ట్రంలో శాంతి భద్రల పరిరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ పోలీస్ విభాగాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తుందని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. గురువారం జైస్వాల్ గార్డెన్‌లోని మైసమ్మ ఆలయ కమిటీ చైర్మెన్ జి.ప్రసన్నాంజనేయులు దాతృత్వంతో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలకు, ఆలయాలకు సీసీ కెమెరాలు నిఘానేత్రాల వంటివని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రల పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన ప్రసన్నాంజనేయులు, మురళీమోహన్లను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జైస్వాల్ గార్డెన్ రెసిడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతల శ్రీనివాస్ ముదిరాజ్, చైర్మెన్ రామాగౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు రమేష్‌గౌడ్, కాలనీ, ఆలయ కమిటీ ప్రతినిధులు యాదవరెడ్డి, వెంకటేష్‌గౌడ్, మదుసూధన్చారి, దిలీప్గౌడ్, కవిత, శ్రీహరిచారి, జైపాల్‌రెడ్డి, అనిల్‌చారి, రాములుయాదవ్, సత్యనారాయణ, సంతోష్‌గుప్త, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.