Authorization
Sat March 22, 2025 11:02:49 pm
ొమలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల
నవతెలంగాణ-ధూల్‌పేట్
మలక్‌పేట్ నియోజకవర్గంలోని బస్తీల సమస్యలు, పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. గురువారం చాంద్రాయణగుట్ట నరికిపూల్ బాగ్‌లోని జోనల్ కార్యాలయంలో కమిషనర్ సామ్రాట్ అశోక్‌తో కలిసి సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బస్తీల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సాంకేతిక కారణాలతో నెమ్మదిగా కొనసాగుతున్న అభివృద్ధి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అక్బర్ బాగ్, చావుని కార్పొరేటర్లు మిన్హాజ్, షహీద్, మలక్‌పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రజిని కాంత్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ నాగిరెడ్డి, జోనల్ డిప్యూటీ సిటీ ప్లానర్ మల్లికార్జున్, ఏసీపీ అబ్దుల్ ఫహీమ్, ఈఈ (ఎలక్ట్రికల్స్) నాగేశ్వర్ రావు, ఈఈ రాధికా తదితరులు పాల్గొన్నారు.