Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ొమెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయలక్ష్మి
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న రోగులు, గాయపడిన వారికి రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని సుల్తాన్ బజార్ మెటర్నటీ ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయలక్ష్మి కోరారు. గురువారం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రికి డెలివరీ కోసం వచ్చే కొంతమంది మహిళలకు రక్తం అవసరం పడుతుందన్నారు. రక్తదానం చేసేందుకు యువత, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. గతేడాది తమ బ్లడ్ బ్యాంక్ ద్వారా 1848 యూనిట్ల రక్తం సేకరించి రోగులకు అందించామని చెప్పారు. 18-65 ఏండ్ల వారు ఎవరైనా బ్లడ్ డొనేట్ చేయొచ్చని చెప్పారు. నాలుగు నెలలకు ఒకసారి రక్త దానం చేయడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటారని తెలిపారు. సుల్తాన్ బజార్ మెటర్నిటీ ఆస్పత్రి సూపరింటెండెంట్, సిబ్బంది సపోర్టుతో ముందుకెళ్తున్నామన్నారు.