Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్‌మెట్
క్యాబ్ డ్రైవర్ కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ సెక్యూర్ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బైరగోని రాజు గౌడ్, ప్రచార కమిటీ చైర్మెన్ పొడుగు శ్రీకాంత్ అన్నారు. ప్రమాదవశాత్తు ఇటీవలే మృతి చెందిన యూనియన్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ బ్రహ్మచారి (నాగరాజు) కుటుంబానికి రూ.14,550, నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రతీ డ్రైవర్ యూనియన్ సభ్యత్వం తీసుకోవాలన్నారు. యూనియన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. కేతేపల్లి మండల అధ్యక్షులు బద్దె వెంకన్న, గబ్బర్‌సింగ్ ఫాస్ట్‌ఫుడ్ తమ సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.