Authorization
Wed March 19, 2025 12:28:52 am
ొ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి
నవతెలంగాణ-ఓయూ
అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో మేలు చేస్తుందని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. గురువారం తార్నాకలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ రూ. 60వేలు చెక్కును బాధితుడు జె. సజన్ లాల్‌కు అందజేశారు. కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంటి కుమార్, టీఆర్ఎస్ నాయకులు జింకల మల్లేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.