Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ొకూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
అన్ని సర్కిళ్లలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. గురువారం జోనల్ కార్యాలయంలో ఇంజినీరింగ్, పోలీస్, (ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్) సీఆర్ఎంపీ ఏజెన్సీ వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూకట్పల్లి జోన్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు, ఎఫ్‌ఓబీలు మార్చడం, జంక్షన్ల అభివృద్ధి, యూ టర్న్ వద్ద సమస్యలు, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అన్ని సర్కిళ్లలో సంబంధిత అధికారులతో క్షేత్ర స్థాయిలో పరిశీలించి ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు సమర్పించాలని కోరారు. నివేదికలు అందిన వెంటనే యూ టర్న్ వద్ద సమస్యలు, జంక్షన్ల అభివృద్ధి, బ్లాక్ స్పాట్స్, ఆర్ఓబీలు మార్చడం ఇతర సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఎస్ఈ చిన్నారెడ్డి, మాదాపూర్ ఏసీపీ జి.హనుమంతరావు, ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్, కృష్ణయ్య, ఈఈ గోవర్ధన్‌గౌడ్, ఈఈ సత్యనారాయణ, సుకుమార్‌రెడ్డి, సీఆర్ఎంపీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.