Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
గోరఖ్‌పూర్‌లో ఆగస్టు 10, 2017న బాబా రాఘవదాస్ వైద్య కళాశాలకు చెందిన నెహ్రు ఆస్పత్రిలో జరిగిన తీవ్ర వైద్య సంక్షోభంపై డాక్టర్ కఫీల్ ఖాన్ రాసిన 'ది గోరఖ్ పూర్ హాస్పిటల్ ట్రాజెడి' పుస్తకాన్ని గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ సత్తార్ ఖాన్, సియాసత్ పత్రిక ఎండీ జహీరుద్దీన్ ఖాన్, ప్రొఫెసర్ సీఎల్ విశ్వేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కఫీల్ ఖాన్ మాట్లాడుతూ గోరఖ్‌పూర్‌లో ప్రాణవాయువు అందక 63 మంది చిన్నారులు, 18 మంది పెద్దల ఊపిరి ఆగిందన్నారు. అందుబాటులో ఉన్న వైద్యుల సాయంతో ఆక్సిజన్ సిలిండర్లను తెప్పించి అత్యవసర వైద్య చికిత్సలు అందించడంతో తనను సస్పెండ్ చేసిన ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. అప్పుడు జరిగిన ఘటనల ఆధారంగానే ఈ పుస్తకం రాశానని తెలియజేశారు.