Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్లో బడి బయటి పిల్లలను గుర్తించే కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 11వ తేదీ నుంచి విద్యాశాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి రోజువారీ వివరాలు అందించాలని ఉన్నతాధి కారుల నుంచి ఆదేశాలు అందాయి. ఇందుకు అవసరమె ౖన చర్యలను జిల్లా విద్యాశాఖ అధికారులు చేపట్టారు.
ఇంటింటికి సర్వే ఇలా..
విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నెల 11 నుంచి 25వరకు జిల్లాలోని 16 రెవెన్యూ మండలాల పరిధిలో సర్వే చేపట్టారు. మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు, ఐఆర్పీలు, డీఎల్ ఎంటీలు ఈ సర్వేలో పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ ఇటీవల జూమ్ యాప్లో సమావేశం నిర్వహించి విధివి ధానాలు వెల్లడించింది. చదువుక దూరంగా ఉన్న విద్యార్థులను గుర్తించి వారి వివరాలను నివేదించాలని సూచించింది. ప్రతి మండలంలోని సంబంధిత పాఠశాలకు చెందిన సీఆర్పీలు ఇంటింటికి తిరిగి ఎంత మంది చిన్నారులు ఉన్నారు. ఏయే తరగతి, ఏ పాఠశా లలో చదవుతున్నారో వివరాలు సేకరించాలి. ఇందుకు 6నుంచి 19 ఏండ్ల వయసులోపు పిల్లలు చదువుకు దూరంగా ఉంటూ పనులకు వెళ్తుంటే ఎందుకు పాఠశా లకు రావడం లేదని వివరాలు తెలుసుకుని వారి ఫోటోల తో సహా ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందులో 6-14 ఏండ్ల వారిని ఒక జాబితాగా, 15-19 ఏండ్ల వారిని మరో జాబితాగా తయారు చేస్తారు.
ఈ నెల చివరి వరకు నమోదు..
ఈనెల 25వరకు సర్వే చేపట్టి అనంతరం 29వ తేదీ వరకు మండలాల వారీగా ఎప్పటికప్పుడు ప్రభంద్ వైబ్సైట్లో సమోదు చేస్తారు. 31న ఆ జాబితాలను జిల్లా అధికారికి సమర్పిస్తారు. తుది జాబితాను ఫిబ్రవరి 2న రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తారు. ఇండ్లు, ఆవాసాలు, పని ప్రదేశాలను సందర్శించి ఆరా తీయాలి. పాఠశాలకు వెళ్లకుండా ఉన్నత చదువులు ఆపేయటానికి కారణాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలు పూర్తి సేకరించాలి. అయితే సర్వే పకడ్బందీగా చేపడితేనే ప్రయోజనం ఉంటుంది. 6-19 ఏండ్ల లోపు పిల్లల చదువులు ఆగిపోవద్దనే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. విద్యార్థి సామర్థ్యం, వయసును పరిగణనలోకి తీసుకొని ఆయా తరగతుల్లో చేర్పిస్తారు. దూరవిద్యలో ప్రవేశాలు కల్పించనున్నారు.