Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ పరిధిలోని చింతల బస్తీలో శుక్రవారం జలమండలి జనరల్ మేనేజర్ సునీల్ కుమా ర్తో కలిసి స్థానిక కార్పొరేటర్ వై.ప్రేమ్ కుమార్ మంజీరా వాటర్ పైప్ లైన్ జంక్షన్ ఇంప్రూమెంట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మంజీరా వాటర్ పైప్ లైన్ జంక్షన్ ఇంప్రూమెంట్ చేయాలని 200 ఫీట్ డయ నుంచి 150 డయ కనెక్షన్ ఇవ్వాలన్నారు. ఇందుకోసం సుమారు రూ.5లక్షలు మంజూరు అయ్యా యనీ, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు డీఈ లౌక్య, ఏఈ శ్రీకాంత్, మేనేజర్ సతీష్, నాయకులు బాబు, ఉపేందర్, కిషోర్, రవి, తదితరులు పాల్గొన్నారు.