Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలో గల ఆదర్శనగర్ వాంబే కాలనీలో స్థానిక కార్పొరేటర్ బాణోత్ సుజాత నాయక్ పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ స్థానికులు నివసించే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే విధంగా కాలనీ వాసులక్కు అవగాహన కల్పించామని వారు అన్నారు. ముఖ్యంగా తాగునీటిని వథా చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుని వాడుకో వాలని సూచిస్తూ కాలనీ సమస్యల పరిష్కారానికి వచ్చిన వినతులను త్వరలో పరిష్కరించే విదంగా చర్యలు చేపడ తామని కార్పొరేటర్ కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది, హెచ్ఎండబ్ల్యూఎస్ సిబ్బంది, ఎంటమాలజీ సిబ్బందితో పాటు బీజేపీ నాయకులు గజ్జల రాజు గౌడ్, శ్రీకాంత్ గౌడ్, బాల్ రాజ్, గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, శంకర్ నాయక్, శివ కృష్ణ, బాణాల వెంకట్, నాయకులు మన్నెమ్మ, సంచి విష్ణు, తదితరులు పాల్గొన్నారు.