Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్‌రెడ్డి తఆధ్వర్యంలో క్రీడాకారులకు వివిధ క్రీడల్లో ప్రోత్సహం ఇచ్చేందుకు బోయిన్పల్లి క్రీడ మైదానం శరవేగంగా అభివృద్ధి చెందుతో ందని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలిపా రు. శుక్రవారం జంపన, స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు మైదానంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను వెల్లడించారు. బోయినపల్లి క్రీడా మైదానంలో హైమాస్ట్ లైట్లు, పచ్చగడ్డితో ఫుట్‌బాల్ మైదానం, బాస్కెట్ బాల్ మైదానం, రెజ్లింగ్, జిమ్ గదుల అభివృద్ధి, క్రీడాకారుల డ్రెస్ చేంజ్ రూం, టాయిలెట్లను అభివృద్ధి చేస్తున్నట్టు తెలి పారు. కార్యక్రమంలో సురేష్. ధాఫెదర్ విజరు, స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు సత్యనారాయణ, జగదీష్, సుధీర్, ముకేష్ యాదవ్, షకీబ్, సిరాజ్‌చ, అజాం షరీఫ్, వరప్ర సాద్, క్రాంతి, పవన్, పేరుకే మహేందర్, పాల్గొన్నారు.