Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ రాష్ట్ర అడ్వైజరీ కమిటీ ఉపాధ్య క్షుడిగా ప్రముఖ పారిశ్రామికవేత్త కొమ్మెర వెంకట్రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ పాలకమండలి నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. సిద్ధిపేట జిల్లా కుకునూర్పల్లికి చెందిన వెంకట్రెడ్డి గడిచిన రెండేండ్లుగా సలహా కమిటీ సభ్యులుగా పని చేశారు. ఈసందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి సేవ చేసుకునే అవకాశం కలగ డం సంతోషకారమన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం, టీటీడీ బోర్డు తచైర్మెన్ వైవీ సుబ్బారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కరోనా కష్ట కాలంలో టీటీడీ ఆధ్వర్యంలో పదివేల మంది నిరుపేదలకు ఆహార ప్యాకెట్లు అందించామని తెలిపారు. లాక్డౌన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో శ్రీవారి లడ్డు ప్రసాదం అందించడంలో కీలకంగా వ్యవహరించినట్టు తెలిపారు.