Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
జీహెచ్ఎంసీ పరిధిలోని నార్ముల్ మదర్ డెయిరీ పాల విక్రయ కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలనీ, పాడి రైతులకు రూ.4 ప్రోత్సాహకంను వెంటనే విడుదల చేయాలని శుక్రవారం నార్ముల్ మదర్ డెయిరీ చైర్మెన్ గంగుల కృష్ణారెడ్డి మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ము న్సిపల్ మంత్రి కేటీఆర్‌కి విన్నవించారు. ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ నగరంలో నార్మల్ మదర్ డెయిరీకి చెందిన 47 పాల విక్రయ కేంద్రాలు ఉన్నాయనీ, అందులో అశోక్‌నగర్, చిక్కడిపల్లి కేంద్రాలను కూల్చివేసి బస్తీ దవాఖానలను కట్టడానికి అధికారులు యత్నిస్తున్నారని మంత్రికి తెలిపారు. మదర్ డెయిరీ పాల విక్రయ కేంద్రా లను కూల్చకుండా జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో యూనియన్ పాడి రైతులకు రూ.4 ప్రోత్సహకాలను అందించాలని కోరారు. స్పందించిన కేటీఆర్ విక్రయ కేంద్రాలను కూల్చివేయవదని జీహెచ్ఎంసీ కమిషర్‌కు సూచించినట్టు చైర్మన్ తెలిపారు. రూ.4 ప్రోత్సాహకాలు త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎండీ అశోక్ పాల్గొన్నారు.