Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లి డివిజన్లోని వైష్ణవి ఎంక్లేవ్‌లో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నాయ కులకు అండతో ఎలాంటి అనుమతుల్లేకుండా క్రీడా సము దాయాన్ని నిర్మిస్తున్నారు. మాజీ మేయర్ బొంతు రామ్మో హన్ హయాంలో రూ.కోట్లు వెచ్చించి వైష్ణవి ఎంక్లేవ్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. దీనికి 10 మీటర్ల దూర ంలోనే మరో క్రీడా మైదానాన్ని ప్రయివేటు వ్యక్తులు ఏర్పా టు చేస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని డబ్బు లు దండుకోవాలని ఉద్దేశంతో ప్రయివేటు వ్యక్తులు క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతుల్లేకున్నా దర్జాగా వేలాది గజాల స్థలంలో నిర్మాణాలను చేపడుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే స్థానిక ఎమ్మెల్యే అనుచరులమనీ, కాంగ్రెస్‌కు చెందిన నాయకులు సైతం జోక్యం చేసుకుని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య ప్రజల ఇండ్లను కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ అధికారు లకు ఎలాంటి ఫిర్యాదు లేకున్నా చేస్తున్నారనీ, అక్రమంగా క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ విషయమై ఏసీపీ శ్రీధర్ ప్రసాద్‌ను వివరణ కోరగా ఎలాంటి అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తున్నా రనీ, రాజకీయ నాయకుల ఒత్తిడితో ఏమీ చేయలేక పోతున్నామని పేర్కొన్నారు.