Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్/ఓయూ/మల్కాజిగిరి/హిమాయత్‌నగర్
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటనకు ఆటంకం కలిగిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేయడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ నాయకులు అన్నారు. గురువారం దాడికి నిరసనగా మన్సూరాబాద్, గౌతం, మెట్టుగూడ డివిజన్లలో, హిమాయత్‌నగర్ పరిధి హైదర్‌గూడ చౌరస్తావద్ద, అంబర్‌పేట డివిజన్లో ఆ పార్టీ శ్రేణులు నిరసలు తెలిపాయి. నిరసనల్లో మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, గౌతంనగర్ అధ్యక్షులు లక్ష్మణరావు, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ చందు, మీడియా ఇన్చార్జి వెంకట కిశోర్, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా జనరల్ సెక్రెటరీలు మేకల సారంగపాణి, శంకర్ , మెట్టుగూడ ఇన్చార్జి హరి, జనరల్ సెక్రెటరీలు, రాజేష్ ముదిరాజ్, ప్రశాంత్ రెడ్డి, విజరు, బీజేవైఎం మెట్టు గూడ డివిజన్ ప్రెసిడెంట్ నీలం శ్రీనాథ్, అంబర్‌పేట బీజేపీ నేత బి.వెంకటరెడ్డి నిరసనల్లో పాల్గొన్నారు.