Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్ పేట
మూడు చింతలపల్లి మండలంలోని జగ్గంగూడ సంపన్ బోల్ గ్రామంలో గురువారం పూజారి భూలక్ష్మి, మర్యాల వెంకమ్మలు అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం అందుకున్న కార్మిక శాఖ మంత్రి చామకుర మల్లారెడ్డి వారి అంత్యక్రియలకు ఆర్థికసాయం అందజేయాలని సర్పంచ్ చందుపట్ల విష్ణువర్ధన్ రెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు సర్పంచ్ టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 5 వేలచొప్పున అంత్యక్రియల ఖర్చులను అందజేశారు. వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీ వీరాస్వామి, శివ, రమేష్, బిక్షపతి, నర్సింలు, ఆంజనేయులు, నారంరెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.