Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్కలెక్టరేట్
నాగారం మున్సిపాలిటీలోని నాలుగో వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని టీఆర్ఎస్ నాలుగో వార్డు అధ్యక్షుడు జూలకంటి రమేష్ గుప్తా కోరారు. ఈ మేరకు కాలనీ సభ్యులతో కలిసి గురువారం నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. వార్డు సమస్యల గురించి విన్నవించారు. ప్రజలకు అత్యవసరం ఉన్నచోట మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చైర్మెన్ హామీ ఇచ్చినట్టు రమేష్గుప్తా తెలిపారు.