Authorization
Fri March 21, 2025 12:02:39 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
పెద్ద అంబర్పేట మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్న, వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణ, ఐదో వార్డు కౌన్సిలర్ బొర్ర అనురాధలకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమరుకుమార్ జనవరి 24న షోకాజ్ నోటీసు జారీ చేశారు. మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డులో మహవీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ చేపట్టిన అక్రమ నిర్మాణానికి ఎన్ఓసీ (పర్మిషన్) ఇప్పిస్తామని రూ. 40 లక్షలు డిమాండ్ చేశారని, ఇప్పటికే రూ. 32 లక్షలు వీరికి ముట్టాయని వచ్చిన మీడియా కథనాలు, ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ ఈ మేరకు స్పందించారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.