Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో ఉచిత మంచినీటి సరఫరాకు గ్రీన్ సిగల్ రావడంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటానికి శనివారం క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మెన్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.