Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
బడుగులపై జరుగుతున్న అన్యాయాలపై సమగ్ర చర్చకు నాయకులు సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ అన్నారు. విద్యా నగర్ బీసీ భవన్లో బీసీ నాయకుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ సమ సమాజ స్థాపన అనే లక్ష్యంతో రూపొ ందిన రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన న్యాయవ్యవస్థ తదను గుణంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ ప్రమోషన్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య పటిష్టంలో భాగంగా సగటు ప్రజల ఆకాం క్షలు, అవసరాల కోసం రాజకీయ పార్టీలిలు, ప్రభుత్వం ఇచ్చే ఉచిత పతకాలపై తను అధికార పరిధి లేకున్నా ప్రేరేపించే న్యాయ వ్యవస్థ, రాజ్యంగ విరుద్ధంగా ఆర్థిక శక్తులను కేంద్రీకరించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియా సహా రూ.40 లక్షల కోట్ల ప్రభుత్వ రంగాల వాటాలను టాటా, అంబానీ, అదానీలకు అప్పగించిన చర్యలను తీవ్రంగా ఖండించారు. 70 ఏండ్లుగా రాజ్యంగ, ప్రజాస్వామ్య, సామ్యవాద, ఆర్థి వ్యవస్థ ప్రజలకు చేసే అన్యాయాలఫై సమగ్ర చర్చ, అందోళనలకు సిద్ధం కావాలనీ, బడుగులకు, ప్రజాస్వామ్య, రాజ్యంగ వాదులకు ఆయన పిలుపునిచ్చారు. ఆరున్నరేండ్లుగా డ్రగ్స్ కేసుల కేంద్రంగా ప్రముఖ సెలబ్రిటీ, సినీ పరిశ్రమ వాళ్ళఫై స్పష్టమైన ప్రాధమిక సాక్షాధారాలు సేకరించినా తగు చర్యలు తీసుకోని కేసీఆర్ ప్రభుత్వం దీనిపై ఉక్కుపాదం మోపుతామని తెలపడంపై చిత్తశుద్ధి తేలాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి పి.సుధాకర్ ముదిరాజ్, యువ న్యాయ వాదుల సంఘం అధ్యక్షులు జి.వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.