Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ. లక్ష కోట్టు కేటాయించాలని ప్రతిపక్ష రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ(ఎం), సీపీఐ, శివసేన, ఆమ్ ఆద్మీతోపాటు 82 బీసీ కుల సంఘాలు డిమాండ్ చేశారు. శనివారం కాచిగూడ అభినందన్ గ్రాండ్ హౌటల్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు, బీఎస్పీ నాయ కురాలు ఇందిరా శోభన్ హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభు త్వం బీసీ ఆర్థికాభివృద్ధికి ఎలాంటి స్కీంలు పెట్టడం లేద న్నారు. బీసీ వ్యతిరేక వైఖరి అవలంభిస్తోందన్నారు. గతే డాది కేంద్ర బడ్జెట్ రూ.34 లక్షల కోట్లు కేటాయిస్తే బీసీల అభివృద్ధికి రూ.1,050 కోట్లు మాత్రమే కేటాయించినట్టు గుర్తు చేశారు. రాజ్యాంగ బద్ధంగా నియమించిన మండల్ కమిషన్ 40 సిఫార్సు చేయగా కేవలం రెండు సిఫార్సులు విద్య, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు స్కాలర్ షిప్లు మంజూరు, ఫీజుల మంజూరు, హాస్టల్, గురుకుల పాఠశాల భవనాల నిర్మాణాలకు, గురు కుల పాఠశాలల్లో హాస్టళ్ల నిర్వహణకు, సబ్సిడీ రుణాలు మంజూరులకు, స్వయం ఉపాధి పథకాలకు, వ్యవసాయం ఇతర పథకాల మంజూరుకు 80 శాతం గ్రాంటు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీల పథకాలకు కేంద్ర ప్రభుత్వం 80 శాతం గ్రాంటు ఇస్తుందనీ, బీసీల పథకాల అమలుకు ఎలాంటి గ్రాంటు, ఇతర సాయం చేయడం లేద న్నారు. పారిశ్రామికీకరణతో కుల వృత్తులు కోల్పోతున్నార న్నారు. ప్రత్నామ్యాయ ఉపాధి పథకాలు, చిన్న పరిశ్రమలు, స్వయం ఉపాధి పథకాల కు బడ్జెట్ కేటాయించకపొతే పేద కులాలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో 16 లక్షల ఉద్యోగాలు ఏండ్లుగా భర్తీ చేయకుండా పెండింగులో ఉన్నాయనీ, దీని మూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ వర్గాల కోటా భర్తీ కావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీల సంక్షేమాన్ని చూడటానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీల బడ్జెట్ పెంచకపోతే పార్లమెంటును ముట్టడిస్తా మని హెచ్చరించారు. ఈ సమావేశంలో కన్వీనర్ గుజ్జ కృష్ణ, ప్రధాన కార్యదర్శి కోలా జనార్ధన్, లాల్ కృష్ణ, నీల వెంకటేష్, అనంతయ్య, తదితరులు పాల్గొన్నారు.