Authorization
Fri March 21, 2025 09:40:21 am
నవతెలంగాణ-నేరెడ్మెట్
వినాయకనగర్ డివిజన్లోని అనంత్‌నగర్, వినాయక్‌నగర్ బ్లాక్ నెంబర్ 1లో కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అనంత్ నగర్ కమ్యూనిటీ హాల్లో డివిజన్ ప్రజల అభ్యర్ధన మేరకు నూతన కోవిడ్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేశామనీ, ఈ టెస్టింగ్ సెంటర్‌ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంత్ నగర్ కమ్యూనిటీ హాల్‌ను ఇంకా అభివృద్ధి చేస్తామనీ, నూతన రూంలు కడతా మని చెప్పారు. వినాయక్ నగర్ బ్లాక్ 1లో పర్యటించిన సందర్భంలో స్థానిక ప్రజలు రోడ్లు, డ్రయినేజీ సమస్యలను తన వద్దకు తీసుకొచ్చారనీ, తొందరలోనే ఆ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వర్క్ ఇన్స్పెక్టర్ సాగర్, డివిజన్ బీజేపీ అధ్యక్షులు ఓం ప్రకాష్, ఉపాధ్యక్షులు సాయి సురేష్, సీనియర్ నాయకులు శివరాంప్రసాద్, కాలనీ వాసులు ప్రమోద్, సంతోష్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.