Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
శంషాబాద్ చిన్న జీయర్ స్వామి ఆశ్రమం కోసం బోయిన్‌పల్లిలోని అనురాధ ఇంటర్నేషనల్ టింబర్ డిపో శ్రీ రంగా విమాన రథం తయారు చేశారు. శనివారం సాయ ంత్రం బోయిన్పల్లి వీధుల్లో ఊరేగించారు. ఈ సంద ర్భంగా అనురాధ టెంపర్ డిపో చైర్మెన్ చదలవాడ తిరుపతిరావు మాట్లాడుతూ దాదాపు రూ.కోటి విలువ చేసే శ్రీ రంగ విమాన రథం తయారుచేయడం అరుదైన అవకాశం తమ డిపోకుకు దక్కడం సంతోషంగా భావిస్తు న్నట్టు తెలిపారు. చిన్న జీయర్‌స్వామి ఆధ్వర్యంలో శంషా బాద్ వద్ద ముచింతలపల్లిలో నిర్మిస్తున్న ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఎంతో విలువైన అరుదుగా దొరికే బర్మా నుంచి తెపించిన బర్మా టేకుతో తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం, శ్రీరంగం ప్రాంతాలకు చెందిన 45 మంది శిల్ప కళాకారులు 3 నెలలపాటు శ్రమించి 22 అడుగుల ఎత్తు 12 అడుగుల పొడవు 7 అడుగుల వెడల్పుతో ఈ రథాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ రథం చుట్టూ దేవతామూర్తుల 104 విగ్రాహాలను ఏర్పాటు చేయడం ప్రతేకత అన్నారు. ఈ రథాన్ని వేద పండితుల వద్ద మంత్రాలు, భాజా భజంత్రిలతో పూజలు నిర్వహించిన అనురాధ టింబర్ ఇంటెర్నాషనల్ చైర్మెన్ చెదలవాడ తిరుపతిరావు, చెదలవాడ శరత్ బాబు, సెక్రెటరీ కిరణ్ కుమార్, వారి కుంటుంబ సభ్యలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోయినపల్లి పురవీధుల్లో ఊరేగించిన అనంతరం రథాన్ని ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు. గతంలో ఎన్నో ఆలయాలకు ఎన్నో రకాల వస్తువులను తాయారు చేయడంతోపాటు ఇటీవల యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహ ఆలయ ప్రధాన రాజా గోపురాలు తలుపు తాయారు చేయడం, ఇపుడు ఈ రథాన్ని తయారు చేయడం తమకు దక్కిన గొప్ప అవకాశం అని చెదలవాడ కుటుంబ సభ్యలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగూరు బాబు, శిల్పకళా బృందం, మహాబలిపురం స్థపతి రమేష్ కుమార స్వామి వారి బృందం పాల్గొన్నారు