Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
ఎర్రగడ్డలోని మానసిక హాస్పిటల్లో శనివారం సీఐటీయూ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. సీఐటీయూ సిటీ అధ్యక్షులు కె.ఈశ్వర్రావు ఆధ్వ ర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పీఆర్సీ నివేదిక ప్రకారం ప్రతి కార్మికుడికీ కనీస వేతనం రూ.19 వేలు ఇవ్వాలనీ, ప్రతి నెలా ఏడో తారీఖు లోపు జీతాలు చెల్లించాలనీ, పీిఎఫ్ సక్ర మంగా అందించాలని డిమాండ్ చేశారు. మెంటల్ హాస్పిటల్ యూనియన్ ప్రెసిడెంట్గా కె.ఈశ్వర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆర్.అశోక్, వైస్ ప్రెసిడెంట్గా ఎండీ అలీమ్, జహీరా, మోసిన్, జనరల్ సెక్రెటరీగా సరిత, నాయబ్ అలీ, ఓం ప్రకాష్, ట్రెజరర్గా యాసీన్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా అమ రేందర్, పుష్ప, నాయీమ్, ఈసీ నెంబర్లుగా నాగరాజు, పద్మను ఎన్నుకు న్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది కార్మికులు పాల్గొన్నారు.