Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవనం త్వరలో ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో నగర పోలీస్ కమి షనర్ సీవీ ఆనంద్ ఏర్పాట్లను పరిశీలించారు. బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 12లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. శనివారం కమాండ్ అండ్ ట్రోల్ సెంటర్‌ను సందర్శించిన సీపీ ప్రాజె క్టు మేనేజ్మెంట్ యూనిట్‌తోపాటు టెక్నికల్ కమిటీతో సమావేశం నిర్వహించారు. కార్యాలయంలోని అధికారుల చాంబర్స్‌తోపాటు అన్ని గదులను పరిశీలించారు. పెండిం గ్లో ఉన్న చిన్నచిన్న పనులను పూర్తి చేయాలని ఆదేశిం చారు. బిల్డింగ్ పనిని పూర్తి చేసి, ఫిబ్రవరి 15నాటికి ప్రారంభోత్సవానికిన సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలు సలహాలను, సూచనలను సీపీ అందించారు. ఈ సమావేశంలో అదనపు సీపీ డీఎస్ చౌహాన్, డీసీపీలు జోయేల్ డేవిస్, సునీతారెడ్డితోపాటు జాయింట్ సీపీలు, డైరెక్టర్లు పాల్గొన్నారు.