Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
సమస్యలపై ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయ సంఘా లతో చర్చించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్. మూర్తి డిమాండ్ చేశారు. శనివారం నిర్వహించిన ఎస్ఎఫ్ఐ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కమిటీ సమావే శంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమానికి ఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. ఉపా ధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొత్త కేడర్ల కేటాయింపు వల్ల ఉపాధ్యాయులు ఆందోళనతో ఉన్నారన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా పారదర్శకంగా ప్రక్రియ కొనసాగితే ఈ పరిస్థితి ఉత్పన్నం అయ్యేది కాదన్నారు. ఇప్పటికైనా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పరిష్కరించాలని కోరారు. ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నా సమస్యలన్నింటికీ పరిష్కారం చేయవచ్చు అన్నారు. సమస్యలన్నిటికీ పరిష్కారం కోసం భవిష్యత్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర పరిపాలనను స్తంభింపజేస్తారని హెచ్చరిస్తున్నారు.
డిమాండ్స్..
2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి. కొత్త కేడర్ల కేటాయింపు వల్ల స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను తమ స్థానిక క్యాడర్‌కు బదిలీ చేయాలి. సీనియారిటీ, ఇతర సమస్యలపై ఉపాధ్యాయులు పెట్టుకున్న అప్పీళ్లను వెంటనే పరిష్కరించాలి. పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వాలి. స్పాజ్, సింగిల్ మెన్ సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలి. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పడాల శంకర్, అధ్యక్షురాలు భవాని, జిల్లా ఉపాధ్యక్షుడు బ్యాగరి వెంకటేష్, జిల్లా నాయకులు రాజేష్, వివేక్, రిషి, చందన, తదితరులు పాల్గొన్నారు.