Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో కార్పొరేషన్ అధికారులు అలసత్వం వహించడంతో తమకు చెడ్డపేరు వస్తుందని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కార్పొరేషన్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బోడుప్పల్ మున్సిపల్ కార్పొ రేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి కోరారు. శనివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. వివిధ డివిజన్లలో ఉన్న చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్, బఫ్పర్ జోన్లలో అనేక నిర్మాణాలు జరుగుతున్నా యని, సదరు నిర్మాణాలను పరిశీలించి తగు విధంగా చర్యలు తీసుకోవాలని అనేకమార్లు కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, టీపీవో అలీలకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని సదరు లేఖలో పేర్కొన్నారు. బోడుప్పల్ నగరం లోని వరకు వివిధ డివిజన్లలో అనుమతులు లేకుండా, అనుమతులకు మించి చేపడుతున్న నిర్మాణాలను నిలువరించే విధంగా కఠినంగా వ్యవహరించాలని సూచించినప్పటికీ సదరు అధికారుల్లో ఎలాంటి చలనం లేదని పేర్కొ న్నారు. 2020లో జరిగిన హరితహరంలో మొక్కల సంరక్షణ బాధ్యతలు చేపట్టిన కాంట్రా క్టర్ అంజద్‌పాషా తన బాధ్యతను పూర్తి స్థాయి లో నిర్వహించలేదని, అతని కాంట్రాక్టుకు సంబంధించిన బిల్లులను నిలిపివేసి పూర్తిస్థా యిలో విచారణ జరపాలని కోరినా కమిషనర్ ఏకపక్షంగా బిల్లును మంజూరు చేశారని వాపోయారు. ఎఫ్టిఎల్ హద్దులు నిర్ణయించి చెరువులను కాపాడటంలో, ప్రభుత్వ భూము లను సంరక్షించడంలో, పార్క్ స్థలాలను పరిరక్షించడంలో కమిషనర్, టీపీవో పూర్తి స్థాయిలో విఫలం కావడంతో అటు ప్రజలు, మీడియా తమపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిద్వారా తమ పాలకవర్గానికి, పార్టీకి చెడ్డపేరు వస్తుందని చెప్పారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే పాలకవర్గానికి నాయకత్వం వహించే మేయర్ మాటను వినకుండా పెడచెవిన పెట్టి నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్న కమిషనర్‌పై అధికారులు చర్యలు తీసుకుంటారా.. లేదా చూడాలి మరి..!