Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
అభివృద్ధిలో పరుగులు పెడుతున్న ఈస్ట్ హైదరాబాద్లో ప్రధానమైన ప్రాంతం బోడుప్పల్. తెలంగాణ నలుమూలల నుంచి వలసొచ్చి స్థిరపడిన ప్రజలకు ప్రస్తుతం సౌకర్యవంతమైన నగరంగా మారింది. అన్నివర్గాల ప్రజలకు ఆలవా లంగా ఇక్కడ వివిధ పరిశ్రమల్లో పనిచేస్తూ స్థిర నివా సాలు ఏర్పర్చుకున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఏర్పడటం, మొదటిసారి పాలకవర్గం కొలువుదీరగానే ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకనుగుణంగానే బోడుప్పల్ నగర పాలక సంస్థ రెండేళ్లలో ఎంతో ముందంజలో నిలిచింది. మేయర్ సామల బుచ్చిరెడ్డి, పాలకవర్గం ప్రత్యేక దృష్టితో కరోనా కష్టకాలన్నీ సులువుగా అధిగమించి మళ్లీ అభివృద్ధి బాటపట్టింది. ఇప్పటివరకు బీటి రోడ్ల అభివద్ధి కోసం 8 కోట్ల 29 లక్షలు, సీసీి రోడ్లు, డ్రైనేజీలకు 27 కోట్ల 16 లక్షలు కేటాయించి సుందర నగరంగా తీర్చిదిద్దే చర్యలు చేపట్టింది. పార్కుల అభివృ ద్ధికి శ్రీకారం చుట్టి స్థానికులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తోంది. శ్మశానవాటికల కోసం కోటి 7లక్షలు కేటాయించి 'చివరి' వీడ్కోలుకూ ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు కొనసాగాయి. వరదల ధాటికి కొట్టుకు పోయిన రోడ్లకు మరమ్మతులు చేపట్టి స్థానికులకు ఆటం కాల్లేకుండా చూశారు. అదేవిధంగా హరితహారం కోసం 8 కోట్ల 80 లక్షలు కేటాయించి హరిత బోడుప్పల్గా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించారు. ఇవేగాక వీధి లైట్లు, నీటి సౌలభ్యత, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి అన్నితరహా చర్యలు చేపట్టారు.