Authorization
Fri March 21, 2025 08:34:01 am
నవతెలంగాణ-ఘట్కేసర్
అనాథóలను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని కెనరా బ్యాంక్ పోచారం బ్రాంచ్ మేనేజర్ పోరీక సాగర్ అన్నారు. ఈ సందర్భంగా సీఎస్ఆర్ సహకారంతో పోచారం కెనరా బ్యాంక్ బ్రాంచ్ సీజీఎన్కెహెచ్ పట్నాయక్ డీజీఎమ్ అనంత జాలోనా ఆదేశాల మేరకు బ్యాంక్ మేనేజర్ సాగర్ ఆధ్వర్యంలో చౌదర్ గూడా వైష్ణవి నగర్ ఫోన్ చేసి మాట్లాడారు. జారు ఫౌండేషన్ అనాథ పిల్లలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం ఆశ్రమ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న బ్యాంక్ మేనేజర్ సాగర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అనాథ పిల్లలను ఆదుకునేందుకు ముందుకు రావాలని, వారిని అనాథలుగా చూడకుండా సొంత మనుషుల్లా ఆదరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.