Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్/మీర్పేట్
చెరువుల సుందరీకరణతో పాటు వరద కాల్వ నిర్మాణానికి, శ్మశానవాటికల అభివృద్ధికి కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం నియోజక వర్గంలోని బడంగ్పేట్లో రూ.22.32 కోట్లు, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో రూ.35.19 కోట్లు, జల్పల్లి మున్సిపల్లో
రూ.64.86 కోట్లతో చేపట్టే రక్షిత తాగునీటి పథకాలకు, రహదారుల విస్తరణ పనులకు, వరద నీటి కాల్వలు, నాలాల పనులకు, సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, శ్మశానవాటికలు, చెరువుల సుందరీకరణ తదితర అభివృద్ధి పనులకు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఅర్తో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా నిర్మించిన క్రీడామైదానంలో మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి సబితా మాట్లాడారు. ముఖ్య మంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చటానికి నిరంతరం కృషిచేస్తున్నామన్నారు. అభివృద్ధిలో మహేశ్వరం నియోజకవర్గాన్ని ముందు వరుసలో ఉంచడానికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్నామని చెప్పారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామన్నారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు వరద నీరు కాలనీల్లో చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, ఆ సమస్య తిరిగి పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కాల్వల నిర్మాణం కోసం నియోజకవర్గానికి రూ.100 కోట్ల నిధులు మంజూరు చేశారని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, జలమండలి ఎండీ దానకిషోర్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, ఎగ్గే మల్లేష్, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జిల్లా చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, కలెక్టర్ అమోరుకుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, సీడీఎంఏ సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ కప్పాటి పాండురంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కష్ణారెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల చైర్మెన్ సాయిచంద్, డీసీసీబీ అధ్యక్షులు మహేందర్‌రెడ్డి, యువనాయకులు పి.కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, డిప్యూటీ మేయర్లు ఇబ్రం శేఖర్, తీగల విక్రంరెడ్డి, జల్పల్లి మున్సిపల్ చైర్మెన్ అబ్దుల్లా సాది, వైస్ చైర్మెన్ పర్హానా నాజ్, మీర్పేట్ మేయర్ దీప్ లాల్ చౌహాన్, కొత్త మనోహర్ రెడ్డి, బడంగ్పేట్, మీరపేట్ మున్సిపల్ కార్పొరేషన్, జల్పల్లి మున్సిపల్ కమిషనర్లు కృష్ణ మోహన్‌రెడ్డి, నాగేశ్వర్, డా.ప్రవీణ్ కుమార్, కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, ఎక్బాల్ ఖలీఫా, కామేష్ రెడ్డి, డీఈఈ అశోక్, డీఈ గోపీనాథ్, ఏఈ శ్రీనివాస్, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.