Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాలను కల్పించేందుకు ఈనెల 31వ తేదీన ఆన్లైన్ జాబ్మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి అధికారి మైత్రిప్రియ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డస్టర్ టోటల్ సొల్యూషన్స్ సర్వీసెస్ లిమిటెడ్, ఇతర ప్రయివేటు కంపెనీలలో ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులని, ఎంపికనైనా వారికి రూ.15వేల నుంచి 20వేల వరకు జీతం ఇవ్వనున్నట్టు ఆమె వివరించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మధ్యాహ్నం 2గంటలకు జరిగే జూమ్ మీటింగ్లో పాల్గొనవచ్చునని తెలిపారు. జూమ్ ఐడీ: 77991524095, పాస్కోడ్:123456గా పేర్కొన్నారు.