Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
జరిమానాలు చెల్లించని పలు వాణిజ్య సంస్థలకు జీహెచ్ఎంసీ భారీ షాక్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు ఐదు వాణిజ్య సంస్థలను సీజ్ చేశారు. అమీర్‌పేట్‌లో ఓ షాపింగ్ మాల్, మాదాపూర్, జూబ్లీహిల్స్‌లోని రెండు ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీలతోపాటు అబిడ్స్‌లోని నిర్మాణరంగ సంస్థను, మియాపూర్‌లోని ఓ ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. జరిమానాలు చెల్లించకపోవడంతోనే సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. అడ్వర్టైైజ్మెంట్ నిబంధనలు ఉల్లంఘించడంతోనే రూ.21లక్షల నుంచి రూ.38లక్షల వరకు జరిమానాలు విధించినట్టున అధికారులు తెలిపారు.