Authorization
Sat March 22, 2025 01:38:56 am
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో 93 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ నిరుపేదలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఎంతోమందిని ఆపదలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటూ ఆడ బిడ్డలకు అండగా ఉంటూ, నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు.