Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
దేశ సహస్ర అవధా నులలో ఆరుగురు ఉండగా వారిలో ఒకరు కాప్రా ప్రాం తానికి చెందివారు కావటం, అంతేకాక వారి ప్రవచనాలతో సమాజంలో అనేక మార్పులు తీసుకురావటం ఎంతో ప్రశం సించదగినదని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ అన్నారు. గరికపాటి నరసింహా రావును మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షులు కన్నబోయిన రమేష్ యాదవ్, కాప్రా డివిజన్ అధ్యక్షులు ఎ.వినోద్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్, సీనియర్ నాయకులు రోహిన్, కొమ్ము నర్సింగ్‌రావు, ఎం.లక్ష్మణ్‌గౌడ్ సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ సాహిత్యం విభాగం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన గరికపాటి నరసింహారావు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదన్నారు. ప్రతి రోజూ ఉదయాన్నే టీవీలో, నిరంతరం యూట్యూబ్‌లో, ఎల్లవేళలా వాట్సాప్ స్టేటస్‌లో అందరికీ ఏదోబోధ చేస్తూ కనిపిస్తూనే ఉంటారన్నారు. గరికపాటి ఉపన్యాసాలు వినడానికి అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తుంటారన్నారు. గరికిపాటి తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద అవధాని అనీ, మన దేశంలోనే కాక, విదేశాల్లో సైతం ఆయన ఎన్నో అవధానాలను పూర్తి చేశారన్నారు. గరికపాటి గొప్ప ఉపన్యాసకుడు అనీ, మొదట ఆయన 11 అంశాలు, జీవనం, సాహిత్యం, సంస్కృతి వంటి ఇతర అంశాలపై ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు సీడీలుగా విడుదలయ్యాయని తెలిపారు.